స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంపౌండ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగాబాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించిన సంగతి తేలిసిందే. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌ నుంచి 2021లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ఈ సినిమాతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయిలో గర్వించేలా చేసాడు రాజమౌళి.ఏకంగా హాలీవుడ్ ప్రముఖుల వరకు తెలుగు సినిమాలను తీసుకువెళ్లాడు. ఇక ఇంతటి చరిత్ర సృష్టించిన ఈ సినిమా డాక్యుమెంటరీ తీస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంటరీ రాబోతుంది.ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ డాక్యుమెంటరీని డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబందించిన ప్రకటన కూడా చేశారు. ఇక ఇందులో rrr సినిమా రిలీజ్ కి ముందు మేకింగ్, ప్రీ ప్రొడక్షన్, రిలీజ్ తర్వాత సినిమా సాధించిన విజయాలు ఇలా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అన్నీ క్లియర్ గా ఉంటాయి. అయితే నేడు దీని ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఇక ట్రైలర్ లో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాకోసం ఇద్దరు పులులతో కలిసి పనిచేశానని చెప్పాడు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసం ఎంత కష్ట పడ్డారో ఎలా చేసారో తెలిపారు. ఇందులో హీరోయిన్ గా నటించిన ఆలియా కూడా ఈ సినిమా గురించి తెలిపింది. ట్రైలర్ లో మూవీ టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో తెలుస్తుంది.తాజాగా జక్కన్న టీం డాక్యుమెంటరీ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20 నుంచి ఎంపిక చేయబడ్డ థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: