అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూకి హాజరైన హాలీవుడ్ నటి కిమ్ కీర్థాషియాన్ తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టింది.. ఇది తెలిసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఎందుకంటే ఈనటి స్పెర్ముతో ఫేషియల్ చేయించుకుందట.. తన సీక్రెట్ కూడా ఇదే అని తెలియజేసింది.. అయితే ఆ స్పెర్మ్ ప్రత్యేకంగా పెంచినటువంటి సాల్మన్ అనే చేపల నుంచి తీసినటువంటి వీర్యంతో చేయించుకుంటానని వెల్లడించినట్లుగా సమాచారం.. అయితే ఈ సాల్మన్ ఫిష్ వీర్యం కేవలం ఫేస్ గ్లో కోసమే కాదని ఇతరత్న బ్యూటీ ప్రాడెక్టులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారని సమాచారం.
అయితే ఈ సాల్మన్ చేపల స్పేర్ ఇండియాలో కొంతమంది మాత్రమే ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ఫేషియల్ మొత్తం మూడు రకాలుగా ఉంటుందట.. ఇందులో టాపికల్ అప్లికేషన్ అనేది 15వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉన్నదట.. ఇక రెండవది మైక్రో నీడిండ్ ఈ ఫేషియల్ సుమారుగా 40 వేల రూపాయల వరకు చార్జ్ చేయబడుతుందట ఇక మూడవది స్పెర్ములోని డిఎన్ఏ ద్వారా ఇంజెక్ట్ చేస్తారట. ఇది సుమారుగా 80 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి సోషల్ మీడియాలో ఈ సాల్మన్ చేపల స్పెర్మ్ గురించి తెగ వైరల్ గా మారుతున్నాయి.