అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ సినిమా విడుదలై 12 రోజులు పూర్తిచేసుకుంది. అయితే ఈ కేవలం 12 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ ను దాటేసి మరో సంచలనం సృష్టించింది.తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి పుష్ప 2 అద్భుతమైన హోల్డ్‌తో కలెక్షన్ల సునామీని కొనసాగిస్తోంది.ఇదిలావుండగా పుష్ప-2 మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.హైదరాబాద్లోని rtc క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు.దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైలుకి వెళ్ళాడు.కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టయి నైట్ మొత్తం జైలులో ఉన్న అల్లుఅర్జున్ మరుసటి రోజు ఉదయమే బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చేసాడు.

అయితే తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ కు మరో షాక్ తగలనుంది . అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలావుండగా ఒక అభిమానిని కోల్పోయిన విషాద ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుకావడం కొత్త చర్చకు దారి తీసింది. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ రావడంతో దేశం మొత్తం పుష్పటు గురించి మాట్లాడుకుంటుంది దీంతో సినిమాకు ఊహించని విధంగా కలెక్షన్స్ పెరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా నార్తులో అరెస్టు తర్వాతే సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయని ప్రపంచవ్యాప్తంగా 74% మేర పెరిగినట్లు వెల్లడించాయి. కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.1409 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ క్రమంలో నే విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ సినిమా లాంగ్ రన్‌లో మరింత భారీ వసూళ్లను సాధించి 1500 కోట్ల గ్రాస్‌ను కూడా టచ్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: