తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన హవాను చూపిస్తున్న వారిలో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని నాగార్జున. తన నటన, ఆకట్టుకునే మాటలు, అందంతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. ముఖ్యంగా మన్మధుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోకుండా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోయిన్ల నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్క హీరోయిన్స్ తో నటించాడు. యంగ్ ఏజ్ నుంచి ఆరు పదుల వయసులోనూ తన సత్తాను చాటుకుంటున్నాడు. అయితే తాజాగా చిరంజీవిపై నాగార్జున కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో చిరంజీవి చేసే సినిమా షూటింగ్ కు వెళ్లినట్లుగా నాగార్జున పేర్కొన్నాడు.


అప్పుడు చిరంజీవి చేసే బ్రేక్ డాన్సులు చూసి నా వల్ల కాదనుకొని సినిమాలు కాకుండా వేరే వైపుకు వెళ్లాలని అనుకున్నట్లుగా నాగార్జున అన్నాడు. ఆ వెంటనే చిరంజీవి చేసే డ్యాన్సులు చూసి అక్కడి నుంచి వచ్చేసానని కింగ్ నాగార్జున అన్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని అందించిన వేదికపైన నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఈ రహస్యాన్ని వెల్లడించారు.


మరోవైపు మెగాస్టార్ చిరంజీవిది ఒదిగి ఉండే స్వభావం గురించి ఈ వేదిక పైన చెబుతూ నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. ఇక నాగార్జున, చిరంజీవి మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఒకరి పట్ల ఒకరికి అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి. వీరి కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్లలో తరచుగా కలుసుకుంటూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి మాట్లాడుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: