తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాక్టర్స్ వస్తూనే ఉంటారు.అయితే చాలామంది మాత్రం తమకు గుర్తుండిపోయే పాత్రలలో తక్కువ మంది నటిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో మత్తు కళ్ళ సుందరిగా పేరుపొందిన భువనేశ్వరి కూడా ఒకరు.. అయితే గ్లామర్ నటిగా, బోల్డ్ నటిగా పేరు సంపాదించుకున్న భువనేశ్వరి కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.. ఈమె సినిమాలలోనే కాకుండా సీరియల్స్ లో కూడా ఎక్కువగా నటిస్తూ ఉండేది. కానీ ఒకానొక సమయంలో భువనేశ్వరి పైన ఒక భయంకరమైన కేసు ఆమెపైన నమోదు చేసేలా చేశారట.


దీంతో భువనేశ్వరి ఎన్నో అవమానాలను ఎదుర్కొని సుమారుగా మూడేళ్లపాటు చేయని నేరానికి కూడా ధైర్యంగా కేసును ఎదుర్కొని పోరాడి చివరికి విడుదల అయింది. ఆ కేసు నుంచి బయటికి వచ్చినా కూడా తన పైన పడిన మచ్చ వల్ల కలిగిన బాధ ఆమెను వదల్లేదట. దీంతో చాలా కాలం పాటు ఆమె మానసిక ఒత్తిడిలోకి కూడా గురైందట. నిజానికి భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. నటన వైపు ఇంట్రెస్ట్ ఉండడంతో ఈమె చెన్నైకి వెళ్లి అక్కడ కష్టపడి పలు రకాల సీరియల్స్ లో కూడా నటించిందట.


ఎన్నో వ్యాంపు , బోల్డ్ పాత్రలలో నటించి అలరించిన భువనేశ్వరి ప్రస్తుతం అవకాశాలు లేక చెన్నైలో సన్యాసిల జీవిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భువనేశ్వరి బంగ్లాలో కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగాయని వాటి ద్వారా ఈమెకు ఆదాయం వస్తుందనే విధంగా వార్త వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భువనేశ్వరి రెండు దేవాలయాలలో నిత్యం అన్నదానం చేయిస్తున్నదట. తనకు ఇష్టమైన పండుగ వస్తే పేద ప్రజలకు వస్త్ర దానాలు కూడా చేస్తోందట భువనేశ్వరి. తినడానికి తిండి లేని సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను అవమానాలను కష్టాలను ఎదుర్కొన్నానని అలాంటి పరిస్థితి లో ఉన్న వారిని చూసి అన్నం పెట్టాలనిపించింది అంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: