టాలీవుడ్ ఇండస్ట్రీలో కథల విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. చాలామంది స్టార్ హీరోలతో పోల్చి చూస్తే మహేష్ బాబు సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. నెగిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది.
 
ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లకు కళ తెచ్చాడని చెప్పవచ్చు. హనుమాన్, గుంటూరు కారం సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో రిలీజ్ కాగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ పర్ఫామెన్స్ సైతం అదిరిపోయింది.
 
ఒకప్పుడు మహేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ ఈ సినిమాలో మాత్రం మహేష్ కు తల్లిగా నటించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా శ్రీలీల పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చినా మీనాక్షి చౌదరి రోల్ మాత్రం వృథా అయింది. హారిక హాసిని నిర్మాతలకు మాత్రం గుంటూరు కారం సినిమా మంచి లాభాలను అందించిందని కచ్చితంగా చెప్పవచ్చు.
 
గుంటూరు కారం సినిమాలో కమర్షియల్ అంశాలకు పెద్దపీట వేయడం సినిమాకు ప్లస్ అయింది. కుర్చీ మడతబెట్టి సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. గుంటూరు కారం సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మహేష్ బాబు కథలను ఎంచుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన మూవీ గుంటూరు కారం అని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: