అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి ప్రేమాయణం లాంటి కొన్ని పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకున్నప్పటికీ ఇంకొన్నిటిని మాత్రం సీక్రెట్ గానే ఉంచుతున్నారు. కానీ అలాంటివి ఏదైనా బయటపడ్డాయి అంటే చాలు అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలు అయితే సినీ సెలెబ్రెటీల కెరియర్ పై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గతంలో హీరోయిన్ మహిరా ఖాన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో ఈ ఫోటో కాస్త ఆమె కెరియర్ పై కూడా ఎంతగానో ప్రభావం చూపింది. ఏకంగా అభిమానులు ఆమెను తిట్టిపోసారు.
అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ కావడంపై ఇటీవల మహిరా ఖాన్ స్పందించారు. రణబీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగిన ఫోటోలు లీక్ అయినప్పుడు తన కెరీర్ నాశనమైందని భావించినట్లు పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ చెప్పుకొచ్చారు. ఫోటోలు కారణంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగానో చాలా కోల్పోయాను అంటూ ఆమె తెలిపారు. నా జీవితంలో పెళ్లి విడాకులు పాప పుట్టడం సింగిల్ గా ఉండడం రణబీర్ తో కలిసి సిగరెట్ తాగడం ఫోటోలు లీక్ కావడం ఒక దేశంలో నాపై నిషేధం విధించడం ఇలాంటివన్నీ నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇది నాకు కష్ట కాలంగా అనిపించింది అంటూ మహీర ఖాన్ చెప్పుకొచ్చారు.