స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సంధ్య థియేటర్‌కు వెళ్లి పుష్ప 2 సినిమా చూడటం వల్ల ఒక దుర్ఘటన జరిగింది. అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ చనిపోయింది. గాయపడ్డ ఆమె కొడుకు శ్రీతేజ్‌ ను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంచారు. అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతని మెదడుకి బాగా దెబ్బ తగిలిందని వైద్యులు చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు అతన్ని కలిసిందీ లేదు, పరామర్శించిందీ లేదు.

పిల్లోడిని కలిస్తే సాక్ష్యాలు తారుమారు చేసినట్లు అవుతుందని, చట్టాలు తనను బాలుడిని కలవనివ్వడం చేస్తున్నాయని బన్నీ చెబుతున్నాడు. కానీ వాస్తవానికి చట్టాలు ఏవీ అతన్ని ఆపడం లేదు. అతని పక్కనే ఉన్న వారే తప్పుడు మాటలు చెబుతూ బన్నీ ని మిస్ గైడ్ చేస్తున్నారు. మొన్నీమధ్య అల్లు అర్జున్ ను అరెస్ట్ ను చాలామంది ఖండించారు. రేవతి మరణంలో బన్నీ తప్పులేదని, పోలీసుల తప్పే ఉండని అండగా మాట్లాడారు. అల్లు అర్జున్ జైల్ నుంచి రిలీజ్ అయ్యాక చాలా సంతోషించారు. బన్నీ ఏం తప్పు చేశాడు? ఒక సాధారణ క్రిమినల్లాగా అతన్ని ఎందుకు బెడ్ రూమ్ లో నుంచి పట్టుకెళ్లారు అంటూ పోలీసులకు చివాట్లు పెట్టారు.

 ఇప్పుడు ఎవరైతే ఇలా బన్నీకి మద్దతుగా మాట్లాడుతున్నారో రేపొద్దున వారే అతనికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే బన్నీ ప్రవర్తన తీరు అలానే ఉంది. పాతిక లక్షలు ఇచ్చేసి తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటే వారికి తప్పనిసరిగా చెడ్డ పేరు వస్తుంది. తాంబూలాలు ఇచ్చి తన్నుకోండి అన్నట్లు వారిని అలా వదిలేయకూడదు. పిల్లాడు పరిస్థితి బాగోలేదు, అతనికి జరగకూడదని ఏదైనా జరిగితే ఇదంతా అల్లు అర్జున్ వల్లే జరిగిందని అంటారు. కనీసం అతను పట్టించుకోలేదు, డాక్టర్ల ద్వారా మంచి చికిత్స అందించేలాగా బన్నీ చొరవ తీసుకొని ఉంటే బాగుండేది అంటారు.

పిల్లోడు మళ్లీ నార్మల్ స్థితికి రాకపోతే సానుభూతి అంతా కూడా వారి వైపే వెళ్లిపోతుంది. అలా జరగకుండా బన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మానవతా దృక్పథంతో తన వీరాభిమాని చనిపోతున్నాడనే ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ రోజు కలుస్తూ నిత్యం అతని హెల్త్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బన్నీ ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయకూడదని ఆశిస్తున్నారు. లేదంటే ప్రజలందరూ అతన్ని ఛీ కొడతారని అనడంలో సందేహం లేదని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: