తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా చిరంజీవి గురించి తెలియాల్సిందే. అంతేకాదు సినిమాల్లోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇక స్ఫూర్తిగా నిలిచింది కూడా మెగాస్టారే  కావడం గమనార్హం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. ఇక ఆ తర్వాత ఏకంగా హీరోగా మారి అప్పట్లో హవా నడిపిస్తున్న స్టార్ హీరోలను సైతం వెనక్కినట్టుగా సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

 అప్పటికే ఉన్న స్టార్ హీరోలను కాదని చిరంజీవిని ప్రేక్షకులు అందరూ బాగా అభిమానించడానికి కారణం ఆయన డాన్సులు ఆయన సినిమాలోని పాటలు. ఇలా డాన్సులతోనే సరికొత్త ట్రెండు సృష్టించారు. అందుకే చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులు అందరూ కూడా అదిరిపోయే డాన్సులను ఆకట్టుకునే పాటలను సినిమాలో ఎక్స్పెక్ట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మెగాస్టార్ సినిమాలు చూసుకున్న కూడా ఇలా డాన్స్ లకి పాటలకు పెద్దపీట వేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మొదటిసారి ఇవేవీ లేకుండానే మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారట.


 ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో మెగాస్టార్ సినిమాల్లో ఉండే డాన్సులు సాంగ్స్ ఏవి ఉండవట. ఇవేవీ లేకుండానే నటించేందుకు సిద్ధమయ్యాడట మెగాస్టార్. హీరో క్యారెక్టరైజేషన్ ఆధారంగా కథ నడుస్తుందని కమర్షియల్ ఫార్మాట్ కు పూర్తిగా ఈ సినిమా దూరంగా ఉంటుంది అని తెలుస్తోంది. మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్ర కూడా లేదు అని ఒక టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. 2026 లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అటు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా మూవీలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: