బిగ్బాస్ షో ముగిసిన వెంటనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటిటి బిగ్ బాస్ షోని ప్రారంభించారు. అయితే ఇక ఈ షోని 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి ఓటీటి బిగ్ బాస్ షోలో బిందు మాధవి విజేతగా నిలిచింది. ఆ తర్వాత రెండవ సీజన్ ఉంటుందని ఎంతోమంది ఆశపడ్డారు. బిగ్బాస్ 8వ సీజన్ ముగిసిన వెంటనే జనవరి నెల నుంచి ఈ ఓ టి టి సీజన్ ప్రారంభమవుతుందని వార్తలు కూడా వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ టీం కూడా చర్చలు జరిపిందట. కానీ ఇప్పుడు బిగ్బాస్ ఓటిటి సీజన్ ప్రసారమయ్యే అవకాశం లేదు అన్నది తెలుస్తుంది.
తప్పకుండా ఓటిపి సీజన్ ని మరోసారి ప్రసారం చేయాలని ఆలోచన నిర్వహకులకు ఉన్నప్పటికీ బిగ్బాస్ ఎనిమిదవ సీజన్ నిర్వహణకు ఖర్చు ఎక్కువైపోయిందట. వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా భారీ రేటింగ్ సంపాదించి ఎక్కువ డబ్బులు పోగు చేసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేసినప్పటికీ.. అటు బాగా ఫేమస్ అయిన సెలబ్రెటీలను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించడంతో వారికి రెమ్యూనరేషన్లు ఎక్కువైపోయాయట. దీంతో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పని అయిందట. ఇక టిఆర్పి రేటింగ్ కూడా పెద్దగా రాకపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయట.
ఇలా పూర్తిగా నష్టాలు గెలిచిన సీజన్ తర్వాత వెంటనే అనాలోచిత నిర్ణయం తీసుకోకూడదని అటు బిగ్బాస్ నిర్వాహకులు అనుకున్నరట. ఈ క్రమంలోనే ఓటీటి సీజన్ ప్రారంభించవద్దని నిర్ణయించుకున్నారట. దీంతో ఇది బిగ్ బాస్ ప్రేక్షకులు అందరికీ కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక మళ్లీ బిగ్ బాస్ షో చూడాలి అంటే మాత్రం తప్పకుండా ఇక తొమ్మిదవ సీజన్ ప్రారంభం అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.