తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి ఎక్కువ శాతం యంగ్ హీరోల కంటే కూడా సీనియర్ స్టార్ హీరోల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించిన ఈయన ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రమ్ మూవీ ని రూపొందించాడు. ఆ తర్వాత రవితేజ తో రాజా ది గ్రేట్ అనే సినిమాను రూపొందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎఫ్ 2 అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఎఫ్ 3 సినిమాను రూపొందించాడు.

ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఆఖరుగా అనిల్ రావిపూడి , బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను రూపొందించాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అనిల్ ఎక్కువ శాతం సీనియర్ స్టార్ హీరోల వైపే మొగ్గు చూపుతూ వారితో సినిమాలు చేస్తూ కెరీర్ను ముందుకు సాగించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: