హెరాల్డ్ టాలీవుడ్ స్టార్స్ మెరుపులు 2024: ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్.. ఫ్లాప్ స్టార్ గా మెగా హీరో.!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఏడాది ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వంటి రెండు సినిమాలతో మన ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాల్లో ఒక్క సినిమా కూడా మెగా ఫ్యాన్స్ ని అల్లరించలేదు. ముఖ్యంగా మట్కా సినిమాకి కోట్ల బడ్జెట్ పెడితే దాదాపు 64 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. అలా ఈ ఏడాది డిజాస్టర్ అయిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో మట్కా సినిమా ఉంది. మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం మెగా ఫ్యాన్స్ ని కూడా ఆలోచించలేకపోయింది.ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసినప్పటికీ అందుకోలేకపోయింది. మట్కా సినిమా మాత్రమే కాదు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కూడా మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.