అవును, అమీర్ ఇపుడు మన తెలుగు దర్శకుడు చెప్పిన ఓ కధకి పచ్చ జెండా ఊపేసాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమీర్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడు. గతంలో ‘పీకే’, 3 ఇడియట్స్ వంటి ఆయన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయం సాధించడంతో, ఆయనకు ఇక్కడ కూడా ఓ మోస్తరు ఫాలోయింగ్ ఏర్పడింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సౌత్ ఫిలిమ్స్ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నాడని వినికిడి. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో కొంతకాలంగా ఆమిర్ చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి ఆమిర్‌కు ఒక కథ వినిపించారట. కథ నచ్చడంతో ఆమిర్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఇక జనవరి చివరి వారంలో స్క్రిప్ట్‌పై తుది చర్చలు జరగనున్నాయని కూడా తెలుస్తోంది. అన్నీ బాగా జరిగితే ప్రాజెక్ట్ గురించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన కూడా రావచ్చు. దిల్ రాజు తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సౌత్ ఇండియన్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఉండడంతో ఇపుడు అందరూ మనవైపు చూస్తున్నారు. అందుకే ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి ఇతర భాషల హీరోలు సైతం మన దర్శకులతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా వారి బాటే పట్టాడు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ స్టార్ హీరో ‘సీతారే జమీన్ పర్’తో పాటు, ‘లాహోర్ 1947’ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంతేకాకుండా రజనీకాంత్, నాగార్జున – ఉపేంద్రతో కలిసి ‘కూలీ’ అనే తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.