కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేయడం అనేది పెద్ద విషయంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో 1000 కోట్ల కలెక్షన్లను సాధించిన సినిమాలు చాలానే వస్తున్నాయి. ఇప్పటివరకు వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించిన ఇండియన్ సినిమాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ఈ వెయ్యి కోట్ల కలెక్షన్లను ఏడుగురు దర్శకులు తమ సినిమాలతో అందుకున్నారు. ఆ దర్శకులు ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 1000 కోట్ల కలెక్షన్లను రెండు సినిమాలతో అందుకున్న ఏకైక దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి 2 అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు మించి కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా 1200 కోట్లకు మించిన కలెక్షన్లను వసూలు చేసింది. నితీష్ తివారి కొన్ని సంవత్సరాల క్రితం దంగల్ అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ 1000 కోట్లకి మించిన వసూలను రాబట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంత్ నీల్ "కే జీ ఎఫ్ చాప్టర్ 2" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 1000 కోట్లకి మించిన కలెక్షన్లను రాబట్టింది. ఆనంద్ సిద్ధార్థ్ కొంత కాలం క్రితం పఠాన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. 

ఇక అట్లీ కొంత కాలం క్రితం జవాన్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 AD సినిమా 1000 కోట్లకి మించిన కలెక్షన్లను రాబట్టింది. సుకుమార్ రూపొందించిన పుష్ప పార్ట్ 2 మూవీ కూడా వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా ఇప్పటివరకు ఈ ఏడుగురు దర్శకులు తెరకెక్కించిన సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: