టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చరణ్ కి జోడిగా కియా ల్ర అద్వానీ నటించగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను , ఒక టీజర్ను , కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని ఎంట్రవెల్ సన్నివేశం అద్భుతంగా ఉండబోతున్నట్లు , ఈ మూవీలోని ఇంట్రవెల్ సన్నివేశంతో సెకండ్ హాఫ్ పై మరింత అంచనాలు పెరగబోతున్నట్లు ఆ రేంజ్ లో శంకర్ ఈ సినిమాలోని ఇంట్రావెల్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు , ఆ ట్విస్ట్ తో ఒక్క సారిగా సినిమా రేంజ్ మరింతగా పెరగనున్నట్లు , ఆ ట్విస్ట్ కాగానే ప్రేక్షకులు అంతా షాక్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా ఇంటర్వెల్ , క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: