సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే సూపర్ గా సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొంత మంది కి అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా అవకాశాలు పెద్దగా దక్కవు. అలా అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా పెద్ద స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిపోయిన బ్యూటీలలో దాక్ష నాగర్కర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ 2007 లో కన్నడ సినిమా భూగత అనే మూవీ తో సినీ రంగం లోకి అడుగు పెట్టింది. 

ఆ తర్వాత ఈ నటి 2015 లో ఏకే రావు పీకే రావు  సినిమా ద్వారా తెలుగు సినీ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్ష నగార్కర్ 2021 లో విడుదలైన జాంబీ రెడ్డి మూవీ లో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటికి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ నటి కొంత కాలం క్రితం రవితేజ హీరో గా రూపొందిన రావణాసుర అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు కూడా గొప్ప గుర్తింపు దక్కలేదు. ఇప్పటివరకు కన్నడ , తెలుగు సినిమాలలో నటించిన ఈమెకు అందం , అభినయం , నటన అన్ని ఉన్నప్పటికీ పెద్ద స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు.

మామూలు క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కిన అవి పెద్ద స్థాయి విజయాలను సాధించకపోవడంతో ఈ ముద్దు గుమ్మకు క్రేజ్ దక్కడం లేదు. ఇక కొంత మంది దాక్షా నాగర్కర్ కు స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చి , ఆ సినిమా కనుక అద్భుతమైన విజయం సాధించినట్లయితే ఈ బ్యూటీ ఈజీగా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: