తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి గురించి తెలుగు జనాలకు చెప్పాల్సిన పనిలేదు. వివిధ డబ్బింగ్ సినిమాల ద్వారా అతను అందరికీ సుపరిచితుడే. ఆయన తాజాగా తమిళంలో నటించిన సినిమా 'విడుదల 2'. ఈ సినిమా అదే పేరుతో మన తెలుగులోకి విడుదల కావడంతో హీరో విజయ్ సేతుపతి ప్రమోషన్లో భాగంగా భాగ్య నగరం రావడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలు పంచుకున్నారు. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం తెలుగు జనాలు ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన కెరీర్ 16వ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానాతో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. విషయం ఏమిటంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కానీ, ఎందుకనో ఆయన నటించలేదు.

ఇక ఇదే విషయమై ఓ జర్నలిస్టు ఆయనని ప్రశ్న అడగగా... విజయ్ సేతుపతి దానికి క్లారిటీ ఇచ్చారు. సదరు సినిమాలో తాను నటించడం లేదని కన్ఫర్మ్ చేశారు. విషయం ఏమిటని అడగగా... ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే వేరే సినిమాలు చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఆ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు విజయ్. బుచ్చిబాబు సినిమా కథ తనకి తెలుసునని, కానీ తనకి తగ్గ పాత్ర ఈ సినిమాలో సరిపోయేలా లేదు! అందుకే చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే విజ‌య్ సేతుప‌తి లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం విడుదల పార్ట్‌ 2ని దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మక్కళ్‌ సెల్వన్ టీం ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది. ఇక విజయ్ సేతుపతి మొదటగా తెలుగులో ఓ కేమియో రోల్ చేసిన సంగతి మీకు గుర్తుంది కదా.. అదేనండి... మన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహ రెడ్డి' అని సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిశాడు. అదే ఆయనికి మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: