టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. బాలయ్య ఈ మధ్య కాలంలో వరస పెట్టి సూపర్ సాలిడ్ విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా బాలయ్య హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణులు అయినటువంటి ప్రగ్యా జైస్వాల్ , ఊర్వశి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశం నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మామూలు రంగ్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: