స్నేహ ఉల్లాల్.. ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు . ఆఫ్కోర్స్ ఇప్పుడు సినిమాలో నటించకపోయినప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అందం ఆమె సొంతం . జూనియర్ ఐశ్వర్య గా ట్యాగ్ చేయించుకొని మరి నెట్టింట ట్రెండింగ్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సడన్గా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది.  అయితే ఆమె కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగానే సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది అన్న క్లారిటీ ఆమె స్వయంగా ఇచ్చింది. 


ఆ తర్వాత సోషల్ మీడియాలో అడపాదడపా మాత్రమే అమ్మడు పేరు ట్రెండ్ అవుతూ వచ్చింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్నేహ ఉల్లాల్ పేరు మారుమ్రోగిపోతుంది . దానికి కారణం త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతూ ఉండటం అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొడుకుతో ఆమె పెళ్లి జరగబోతుందట . ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కొడుకు కి ఆల్రెడీ పెళ్లయింది. పిల్లాడు కూడా ఉన్నాడు . తన భార్యకు విడాకులు ఇచ్చేసి మరి స్నేహ ఉల్లాల్ ని పెళ్లి చేసుకోబోతున్నాడట .



దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు . స్నేహ ఉల్లాల్ అందం ముందు ఏ హీరోయిన్ సాటిరారు . అది అందరికీ తెలిసిందే . అలాంటి అందమైన అమ్మాయి ఎందుకు ఇలా సెకండ్ హ్యాండ్ గాడిని పెళ్లి చేసుకుంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరి కొంత మంది మాత్రం స్నేహ ఉల్లాల్ ఆరోగ్యం బాగోలేదు కదా ..మరి ఇతగాడు ఎందుకు ఆమె  పై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దీని వెనక వేరే మర్మమేమన్నా ఉందా..? అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. మొత్తానికి స్నేహ ఉల్లాల్ పెళ్లి వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . దీనిపై అమ్మడు ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తుందో చూడాలి అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: