- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . .


టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ దెబ్బతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజా గారి సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ కు ఒక తీరని కోరిక ఉందట .. ఆ కోరిక ఇక తీరదు అన్న బాధ కూడా ఎన్టీఆర్ను వేధిస్తోందట. మరి ఆ కోరిక ఏంటో ? తెలుసుకుందాం. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు స్టార్ హీరో రేంజ్ కు చేరుకున్నాడు. ఎన్టీఆర్ చివరిగా నటించిన ఏడు సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ .. ఈ అరుదైన రికార్డ్ ఏ టాలీవుడ్ హీరో కు లేదు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని 2011లో పెళ్లి చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ జంటకి భార్గవ్ రామ్ - అభయ్ రామ్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. తారక్ భార్య రెండోసారి గర్భవతి అయినప్పుడు కూతురు పుడితే బాగుంటుందని ఎన్టీఆర్ కోరుకున్నాడట. ఒకవేళ కూతురు పుడితే మంచి పేరు పెట్టాలని అనుకున్నాడట. ఎన్టీఆర్ కోరిక కు వ్యతిరేకంగా రెండో సారి కూడా ఎన్టీఆర్ దంపతులకు కొడుకు పుట్టాడు. నందమూరి ఫ్యామిలీకి తన కూతురు ఆడపడుచు గా ఉండాలని ఎన్టీఆర్ భావించగా దానికి భిన్నంగా జరిగిందని ఎన్టీఆర్ సహితులు చెబుతూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత నీల్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. ఇక దేవర 2 కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే ఓ తమిళ డైరెక్టర్ తో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: