ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ల మూవీలు ఎక్కువగా చూస్తున్నాం.  మరీ ముఖ్యంగా ఒక ఫ్యామిలీకి సంబంధించిన హీరోసే ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలో నటిస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు. మరి ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ - దగ్గుబాటి ఫ్యామిలీ - అక్కినేని ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ ఇలా ఏ హీరోలు ఆ హీరో ఫ్యామిలీతో నటిస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు ఆ స్టార్ హీరో ఫ్యాన్స్. ఆల్రెడీ అక్కినేని నాగార్జున "మనం" సినిమాతో ఆ కోరిక తీర్చేసుకున్నాడు.


నాగేశ్వరరావు - నాగార్జున - నాగ చైతన్య - అఖిల్ - అమల - సమంత - శ్రేయ శరణ్ ..ఆ సినిమాలో నటించి సినిమా చిరస్థాయిగా నిలిచిపోయే రేంజ్ లో నటన పర్ఫామెన్స్ చూపించారు . అయితే ఆ తర్వాత అలాంటి ఒక సినిమా మాత్రం రానే రాలేదని చెప్పాలి . అయితే మనం సినిమా తర్వాత మెగా ఫ్యామిలీ కూడా అలాంటి తరహాలోనే ఒక కథను విన్నిందట . మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ - నాగబాబు - వరుణ్ తేజ్ - రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ - అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించే విధంగా కొన్ని కీలకపాత్రలను కూడా చూస్ చేసుకున్నారట . కానీ సడన్గా ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అంటూ మెగాస్టార్ చిరంజీవినే సినిమాను ఆపేసారట .



కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సినిమాలు జనాలు చూడడానికి లైక్ చేయకపోవచ్చు. మనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా  సెపరేట్గా హీరోలు నటిస్తే చూడొచ్చు .. ఇద్దరు ముగ్గురు హీరోలు నటిస్తే చూడొచ్చు.. కానీ అందరి హీరోలు ఇలా కలిసి నటిస్తే ఫ్లాప్ అయితే అది సినిమాకి బిగ్ మైనస్ గా మారిపోతుందేమో అంటూ ప్రొడ్యూసర్స్ ని నష్టపరచకూడదు అన్న ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సినిమా కథను నచ్చిన కూడా రిజెక్ట్ చేశారట.  మొదటగా ఓకే చేసిన చిరంజీవి ఆ తర్వాత ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడు అంటూ చాలామంది మెగా ఫాన్స్ కూడా బాధపడిపోయారు. ఫైనల్లీ అసలు విషయం బయటపడింది. ఫ్యూచర్ లోనైనా సరే అలాంటి ఓ సినిమా వస్తుందేమో చూద్దాం  అంటున్నారు జనాలు . అయితే రాంచరణ్ - మెగాస్టార్ చిరంజీవి మాత్రం బ్రూస్ లీ అదేవిధంగా ఆచార్య సినిమాలో నటించారు కానీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: