సినిమాల మీద ఉన్న ఇష్టంతో హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టిన రవితేజ మొదట్లో పలువురు డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో సహాయ పాత్రలను పోషించారు. ఈ క్రమంలోనే సింధూరం అనే సినిమాలో అదిరిపోయే పాత్రతో హై లైట్ గా నిలిచారు టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ. అనంతరం సహాయ నటుడిగా నటించారు. దీంతో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు మంచి గుర్తింపు లభించింది.
ఇదిలా ఉండగా.... 2024 సంవత్సరం మాస్ మహారాజా రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. ఈగల్ సినిమా సంక్రాంతికి రావాల్సింది. థియేటర్ల కొరత వల్ల సినిమా వెనక్కి వెళ్ళింది. అనంతరం ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అయింది.
సోలో డేట్ దొరికిన సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయింది. బాలీవుడ్ రైడ్ సినిమాని రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాగా రీమేక్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమాలోని ప్రో, పాటలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫైనల్ గా చూస్తే సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలను నిర్మించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలను ఎదుర్కొంది.