తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని నాళ్ళు నిలిచిపోయే కొందరి హీరోల పేర్లలో మెగాస్టార్ చిరంజీవి తప్పకుండా ఉండి తీరుతుంది. చిరంజీవి ఇన్నేళ్ల ప్రయాణంలో ఇపుడు వరకు ఎన్నో సినిమాలు చేసి ఇపుడు తన 156వ సినిమాలో చేస్తున్నారు.అయితే చిరు సినిమాలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న సమయంలో చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు 2008లో ప్రజా రాజ్యం అనే పార్టీని సొంతంగా స్థాపించారు.. ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదని తెలిసిందే. కొన్నాళ్లకు సినిమాలకు దూరం అయ్యారు. కూడా.. ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి పార్టీ పెట్టారని సమాచారం..మెగాస్టార్ కు రాజకీయాల్లోకి రావాలనే కోరిక కలిగేలా చేసింది తన సినిమానే కారణం అట.. ఆ సినిమా చేసిన తర్వాత అలాంటి కోరిక పుట్టిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరునే స్వయంగా చెప్పారు. సినిమానే కారణమని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో కూలీగా పని చేస్తూ.. ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు. ముఠామేస్త్రి సినిమా ప్రభావం వల్లే చిరుకి ముఖ్యమంత్రి అవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్ళీ సినిమాలే ముద్దు అని సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇదిలావుండగా 2025 సంక్రాంతికి వశిష్ట దర్శకత్వంలోవిశ్వంభర సినిమాతో రానున్నారు చిరు.ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ నుంచి ఒక ఊహించని లైనప్ ఉండగా వీటిలో ఓ సినిమాకి అయితే చిరంజీవికి ఎలాంటి హీరోయిన్ ఉండదు అని ఇపుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో కంప్లీట్ మెగాస్టార్ రోల్ మీదే నడిచే పవర్‌ఫుల్ కథతో యువ దర్శకుడు మాస్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు రీసెంట్ గా అనౌన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అట.

మరింత సమాచారం తెలుసుకోండి: