లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో కుర్ర కారుని మెప్పించింది. ఈ బ్యూటీ నటించిన అందాదున్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుని సిస్టర్ మిడ్ నైట్ కాకుండా విజయ్ సేతుపతి, కత్రినా కలిసి నటించిన మేరీ క్రిస్మస్ సినిమాలో రాధిక నటించింది. ఈ భామ తన ప్రాజెక్టులకన్నా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. సౌత్ యాక్టర్ వేధింపుల మీద ఆమె కొన్ని కామెంట్లు చేసింది. ఓ వెబ్ సిరీస్ లో నగ్నంగా నటించి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది.
ఇదిలా ఉండగా.... ఇటీవలే రాధిక ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా, అక్టోబర్ లో లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడుస్తున్న సమయంలో రాధిక ఆప్టే తన బేబీ బంప్ ను ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది.
ఫిల్మ్ ఫెస్టివల్ లో తన సినిమా సిస్టర్ మిడ్ నైట్ షో ప్రీమియర్ కోసం రాధిక హాజరైంది. ప్రఖ్యాత ఫోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం అద్భుతమైన ఫోటోషూట్ లో పాల్గొనడమే కాకుండా తన బేబీ బంప్ ను ప్రదర్శించిన రాధిక ఆప్టేపైన ప్రశంసలు కురిసాయి. అయితే రాధిక ఆప్టే బేబీ బంప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.