రష్మిక మందన్నా.. అంటే ఒకప్పుడు నేషనల్ క్రష్ అనేవారు.  ఆ తర్వాత అందాల ముద్దుగుమ్మ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకునే సత్తా ఉంది అని పొగిడేవారు. కానీ ఇప్పుడు మాత్రం రష్మిక అంటే ముందుగా శ్రీవల్లి అనే పేరుని గుర్తు చేసుకుంటున్నారు . రష్మిక మందన్నా హీరోయిన్గా అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డు నెలకొల్పింది. 


ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీని తిరగరాసింది . రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులను నెలకొల్పింది. అంతేకాదు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో అంతకు డబుల్ స్థాయిలోనే శ్రీవల్లి పాత్రలో మెరిసిన రష్మిక మందన్నా కూడా హైలెట్ గా మారింది. కాగా ఇప్పుడు రష్మిక మందన్నాకు సంబంధించిన ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా తర్వాత రష్మిక మందన్నాకు బోలెడు ఆఫర్స్ వస్తున్నాయి .



కానీ అన్ని ఓకే చేయకుండా ఆచితూచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని చూస్ చేసుకుంటుంది . కాగా పుష్ప2 సినిమా కోసం రష్మిక మందన్నా దాదాపు 10 కోట్లు ఛార్జ్ చేసింది అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి . మరీ ముఖ్యంగా తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసిన ఈ సినిమానే హైయెస్ట్ గా నిలిచింది అంటూ కూడా వార్తలు వినిపించాయి.  అయితే ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం కూడా రష్మిక మందన్నా తన ఫేవరెట్ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ఖర్చు చేసిందట. ముంబైలోని ఓ బిజీ ఏరియాలో రష్మిక మందన్నా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అంటూ ఎప్పటినుంచో వేచి చూస్తుందట . పుష్ప 2 సినిమా కి వచ్చిన రెమ్యూనరేషన్ తో ఆ ఫ్లాట్ కొనుగోలు చేసేసిందట . రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందట . ప్రజెంట్ ఈ వార్త బాలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: