బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ సీక్వెల్ పై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా అనే సంగతి తెలిసిందే. మరోవైపు బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది.
బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో బోయపాటి శ్రీనుకు ఛాన్స్ ఇస్తారా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. బన్నీ పుష్ప2 సినిమాతో అత్యంత భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. పుష్ప ది రూల్ మూవీ ఇప్పటికే 1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప ది రూల్ మూవీ రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
బోయపాటి శ్రీను కథతో చిరంజీవిని మెప్పిస్తే మాత్రమే ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమయ్యే అవకాశం ఉంది. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతుండగా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి బాక్సాఫీస్ ను షేక్ చేయాలన్ అభిమానులు కోరుకుంటున్నారు.