లైంగిక వేధింపుల కేసులో... మరో సోషల్ మీడియా స్టార్ అరెస్టు అయ్యాడు. ఇప్పటికే జానీ మాస్టర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు... లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే ఈ సంఘటన మరువక ముందే... హైదరాబాదులో మరో సంఘటన తెరపైకి వచ్చింది. తాజాగా లైంగిక వేధింపుల కేసులో.... ఓ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. వెబ్ సిరీస్ యాక్టర్... ఫిర్యాదు మేరకు... ఈ యూట్యూబర్ పై కేసు నమోదు అయింది.


అంతేకాదు ఆ యూట్యూబర్ ప్రసాద్ బేహేరా ను పోలీసులు కూడా అరెస్టు చేశారు. యూట్యూబర్ ప్రసాదును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ఈ తతంగం అంతా చాలా సీక్రెట్ గా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  కానీ ఎట్టకేలకు ఈ అరెస్టు విషయం బయటకు వచ్చింది.ఈ యూట్యూబర్ ప్రసాద్... తో వెబ్ సిరీస్ లో బాధితురాలు నటించినట్లు వార్తలు వస్తున్నాయి.


ఆ వెబ్ సిరీస్ తీసే సమయంలోనే లైంగికంగా బాధితురాలిని వేధించాడట యూట్యూబర్ ప్రసాద్ బేహేరా. గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని...  తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ.... నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు... వెంటనే అతన్ని అరెస్టు చేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో... ప్రసాద్కు మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందు చిన్న చిన్న వెబ్ సిరీస్ లు బాగానే చేశాడు యూట్యూబర్ ప్రసాద్ బేహేరా.


అయితే అమ్మాయి విషయంలో తాజాగా అరెస్టు కావడం జరిగింది.  ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్... ప్రస్తుతం రిమాండ్ కు  వెళ్లాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఆ బాధితురాలు ఎవరు.? ఆమె ఫిర్యాదు చేసింది నిజమేనా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... ఇటీవలే... వచ్చిన కమిటీ కుర్రాళ్లు సినిమాలో కీలక పాత్ర పోషించాడు నిందితుడు యూట్యూబర్ ప్రసాద్ బేహేరా.

మరింత సమాచారం తెలుసుకోండి: