సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కొడుకు శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే... రేవతి కొడుకు శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్‌ తరఫున రంగంలోకి టాలీవుడ్‌ నిర్మాత వచ్చారు. రేవతి కొడుకు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకోవడానికి టాలీవుడ్‌ నిర్మాత అల్లు అరవింద్‌ రంగంలోకి దిగడం జరిగింది.


ఈ సందర్భంగా  సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి.. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు అల్లు అరవింద్. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో పాటు.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అల్లు అరవింద్.  శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తరుణంలో.. అల్లు అరవింద్ పరామర్శించారు.  అల్లు అర్జున్ రాలేడు.. అందుకే అల్లు అరవింద్ వచ్చారని బన్నీ ఫ్యాన్స్‌ అంటున్నారు.


ఎంత ఖర్ఛైనా... శ్రీ తేజ్‌ ను ఆదుకుంటామని తెలిపారు అల్లు అరవింద్‌.  ఇది ఇలా ఉండగా... రేవతి మృతి కేసులో...  ఏ 11 ముద్దాయిగా హీరో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అటు సంధ్య థియేటర్ ఓనర్ల పై కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఇక..  ఈ కేసు నేపథ్యంలో గత శుక్రవారం రోజున టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ తెలంగాణ పోలీసుల అరెస్టు చేశారు.


దీంతో అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.  ఒకరోజు మొత్తం అల్లు అర్జున్ జైలు లోనే ఉన్నాడు. బెయిల్ వచ్చినప్పటికీ కూడా...చంచల్గూడా జైల్లో బన్నీని ఉంచారు. శనివారం ఉదయం... రహస్యంగా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ చేశారు పోలీసులు. ఇక జైలు నుంచి వచ్చిన అల్లు అర్జున్ చూసేందుకు టాలీవుడ్‌ సెలబ్రీటీలు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతు గా నిలిచారు టాలీవుడ్‌ సెలబ్రీటీలు.

మరింత సమాచారం తెలుసుకోండి: