ఇలాంటి సమయంలోనే నాగచైతన్య భార్య శోభిత ,మాజీ భార్య సమంత ఆస్తి విషయంలో ఎవరికి ఎక్కువ ఉందనే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్ సైతం చర్చించుకుంటున్నారు. సమంత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 15 ఏళ్లు అవుతోందట.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సమంత ఆస్తి సుమారుగా 110 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.. అంతేకాకుండా సమంత కొన్ని రకాల యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాకుండా కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఇక శోభిత విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం రూ .20 కోట్ల లోపల సంపాదించిదనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ నాగచైతన్య మీద ఉన్న ఆస్తుల విషయాలు కలుపుకుంటే సుమారుగా 150 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తానికి సమంత మాత్రం శోభితను ఈ విషయంలో మించిపోయిందని చెప్పవచ్చు.. ఇక నాగచైతన్య ,శోభిత ప్రస్తుతం పలు రకాల దేవాలయాలను సందర్శిస్తూ బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అభిమానులు వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.