ఈ సినిమాలోని మరో సాంగ్ ప్రోమో ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట చాలా కొత్తగా ఉంది. అయితే ఇది కేవలం ప్రోమో మాత్రమే పూర్తి పాటను డిసెంబర్ 22న ఉదయం 8.30 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ధియేటర్ లో విడుదల కానుంది. ఈ సాంగ్ ప్రోమో చూసిన వారందరూ ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాపై మెగా ఫాన్స్ కు రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో మరో గేమ్ చేంజర్ సినిమా అవుతుందని అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతో రామ్ చరణ్ మరో సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'ఆర్సీ 16' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నవంబర్ నెలలో మైసూర్ కూడా వెళ్లారు. ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్సీ 16 సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోందని సమాచారం.