అలా దీంతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఇంకా సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేడని కూడా తండ్రి బలవంతం మీద సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారనే విధంగా రూమర్స్ వినిపించాయి. మోక్షజ్ఞకు చివరి నిమిషంలో ప్రజర్ తట్టుకోలేకపోతున్నాడనే విధంగా కూడా రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా ఇలాంటి రూమర్స్ మధ్య ఇలాంటి విషయాలకు చెక్ పెడుతూ.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టీమ్ ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది. అదేమిటంటే ఈ సినిమా గురించి ఆధారం లేని రూమర్స్ ఎన్నో వైరల్ గా మారుతున్నాయి అయితే అందులో ఏమి నిజం కాదంటూ తెలియజేశారు.
ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి సమాచారం అయినా కేవలం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తామని తెలియజేశారు. అప్పటివరకు ఇతర వాటిలో వచ్చే విషయాలను కానీ మీడియా నుంచి కానీ వచ్చిన విషయాలకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. అభిమానులు ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు సమాచారాలను సైతం నమ్మవద్దు అంటూ కోరుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మొత్తానికి ఈ సినిమా పైన రూమర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల సైతం కాస్త ఖుషి అవుతున్నారు.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు.. చాలా స్లిమ్ గా మోక్షాన్ని కనిపిస్తూ ఉన్నారు.