మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత చందమామ , మగధీర సినిమాలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత నుండి ఈమె పరస పెట్టి ఎన్నో సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.

ఎన్నో సినిమాలలో ఆడి పాడి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎన్నో కమర్షియల్ విజయాలను కూడా ఈ బ్యూటీ అందుకుంది. కానీ ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా మాత్రం పెద్ద స్థాయిలో విజయాలను అందుకోలేదు. ఇకపోతే ఈ సంవత్సరం ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ గురించి ఈమె చాలా పెద్ద ఎత్తున ప్రచారాలను కూడా చేసింది. దానితో సత్యభామ మూవీతో కాజల్ తన కెరీర్లో లేడీ ఓరియంటెడ్ సినిమాతో మొదటి విజయం కొట్టేలా ఉంది అని చాలా మంది భావించారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే సుమన్ చెక్కల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నవీన్ చంద్రమూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జూన్ 7 వ తేదీన విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: