పుష్ప-2 స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ రావడం, అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందడానికి చక చకా జరిగిపోయాయి. ఆమె కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ వెంటిలేటర్ పై ఉన్న ఆ బాలుడు కోల్పోవడానికి చాలా కాలం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో అందరి తప్పు ఉందని చాలామంది వాదిస్తున్నారు కానీ తెలంగాణ సర్కార్ మాత్రం అల్లు అర్జున్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అలాంటి నోటీసులు ఇవ్వకుండా బెడ్ రూమ్ లోకి వచ్చి అరెస్టు చేయడం, బెయిల్ వచ్చినా జైల్లో ఉంచడం అనేది కక్ష సాధింపు చర్యగా కొంతమంది చూస్తున్నారు.

 డిసెంబర్ 13 శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం జైల్లో ఉంచొచ్చని ప్లాన్ చేసినట్టుగా కూడా కొంతమంది విశ్లేషించారు. ఇదిలా ఉంటే థియేటర్ యాజమాన్యం చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ సంఘటనపై వివరణ ఇచ్చుకోవాల్సిందిగా ఇప్పటికే ఆ థియేటర్ యజమాని రేణుకకు నోటీసులు పంపించారు. పది రోజుల్లో వివరణ ఇవ్వకపోతే థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కూడా ఉక్కు పాదం మోపుతోంది తెలంగాణ సర్కారు! అరెస్టు చేసిన నేపథ్యంలో కొందరు రేవంత్ రెడ్డిని దుర్భాషలాడారని, అసభ్యంగా పోస్టులు పెట్టారని పోలీసులు వారిపై కేసులు బుక్ చేస్తున్నారు. అంతేకాదు దొరికిన వారిని దొరికినట్లు జైల్లోకి తోసేస్తున్నారట.

ఏ ప్రభుత్వం కూడా ఒక సెలబ్రిటీని నేషనల్ అవార్డు విన్నర్ని ఇంతలా టార్గెట్ చేయలేదు. బన్నీని ఇలా టార్గెట్ చేయడం వెనుక తొక్కిసలాట ఘటన ఒకటే కారణమా? లేకుంటే తెర వెనకాల ఇంకేదైనా కుట్ర ఉందా? అనేది ప్రస్తుతం ఒక సామాన్యుడి మెదడులో మెదులుతున్న సందేహంగా మారింది. అయితే బన్నీకి కొంతమంది సపోర్ట్ చేసేవారు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించేవారు ఉన్నారు కానీ ప్రభుత్వ మరీ దూకుడుగా వ్యవహరిస్తుండడమే సందేహాలకు తావిస్తోంది. ఏదైనా బన్నీ బాధితులను పరామర్శించి వారికి న్యాయం భరోసా ఇచ్చేటట్లు మాటిస్తే తప్ప ఇది చల్లారే లాగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: