భారీ అంచనాలతో రిలీజ్ అయిన... కంగువ సినిమా 2024లో అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో... హీరోగా సూర్య చేస్తే... బాబి డియోల్, దిశాపటాని, యోగి బాబు లాంటి వారు ప్రధాన పాత్రలో కనిపించారు. 106 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో సినిమాను తీసి దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా.... అట్టర్ ఫ్లాప్ అయింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొత్తం 102 కోట్లు మాత్రమే... కలెక్షన్స్ రాబట్టిందట. సినిమా బాహుబలి లా ఉంటుందని హైప్ పెంచడంతో 200 కోట్ల ప్రీ బిజినెస్ అయింది. దాదాపు 500 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. కానీ 100 కోట్లు దాటడమే గగనంగా మారింది. అసలు ఈ సినిమాను తెలుగులో పట్టించుకునే వారే కనిపించలేదు.
ఓవర్సీస్ లో కేవలం 24 కోట్లు మాత్రమే సాధించగలిగింది సూర్య నటించిన కంగువ సినిమా. అటు తమిళనాడులో 35.85 కోట్లు వచ్చాయట. రెండు తెలుగు రాష్ట్రాలలో 15.75 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. కేరళ రాష్ట్రంలో 6.30 కోట్లు వచ్చాయట. కర్ణాటకలో 4.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ కాంగువా సినిమా. ఇక భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో మొత్తం 16 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇలా మొత్తంగా 102 కోట్లు మాత్రమే వసూలు చేపట్టింది సూర్య నటించిన కంగువా సినిమా.