టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ తాజాగా పెళ్లి పీటలెక్కడం ద్వారా వార్తల్లో నిలిచారు. మెడలో తాళిబొట్టుతో కీర్తి సురేష్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెళ్లైన హీరోయిన్లలో చాలామంది మెడలో తాళిబొట్టు వేసుకోవడానికి ఆసక్తి చూపరు. ఈ హీరోయిన్ ను చూసి మిగతా వాళ్లు నేర్చుకోవాల్సిందే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో కీర్తి సురేష్ కనిపించడం గమనార్హం. మెహందీ, కాళ్ల పారాణీ కీర్తి సురేష్ కనిపించడం ఆమె అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పవచ్చు. పెళ్లిరోజుకు ముందు పెళ్లిరోజు తర్వాత కీర్తి సురేష్ సినిమాను ప్రమోట్ చేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
బేబీ జాన్ సినిమాకు కీర్తి సురేష్ 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. సాధారణంగా కీర్తి సురేష్ తీసుకునే పారితోషికంతో పోల్చి చూస్తే ఈ మొత్తం డబుల్ కావడం గమనార్హం. కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాలో గ్లామరస్ గా కనిపించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కు భవిష్యత్తు సినిమాలతో భారీ విజయాలు దక్కాలని అమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
 
కీర్తి సురేష్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఆమెకు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కీర్తి సురేష్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం ఊహించని స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు సౌత్ లో హవా కొనసాగించిన కీర్తి సురేష్ రాబోయే రోజుల్లో నార్త్ ఇండియాలో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. కీర్తి సురేష్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటాలని ఆమె ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: