అల్లరి నరేష్ సినీ కెరీర్ ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేదో చెప్పనక్కర్లేదు. ఈయన కామెడీ జానర్ లో వచ్చి ఎన్నో సినిమాలు హిట్టు కొట్టాడు. రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో అల్లరి నరేష్ ముందుంటారు. అలా తన కామెడీతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యారు.ఎందుకంటే ఈయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో కొద్దిరోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ డిఫరెంట్ జానర్ లో సినిమాలు తీయాలి అని నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమాలను అంతగా ఆదరించలేదు. 

ఇక  ఈ ఏడాది నాగార్జున నటించిన నా సామిరంగా మూవీలో ఓ కీలక పాత్రలో నటించారు అల్లరి నరేష్. ఆ తర్వాత తనకి సెట్ అయ్యే కామెడీ జానర్లో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వావ్ అనేంతలా అయితే లేదు.ముఖ్యంగా బ్రేక్ ఈవెన్ ని కూడా ఈ సినిమా సాధించలేదు.దాంతో ఈ సినిమా అల్లరి నరేష్ కెరీయర్ కి అంత ప్లస్ అయితే కాలేదు. సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.

కానీ ఇదే సినిమా టైటిల్ తో వచ్చిన అల్లరి నరేష్ మూవీ మాత్రం అట్టర్ ప్లాఫ్ అయింది.ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫరీయా అబ్దుల్లా నటించింది.దాంతో అల్లరి నరేష్ బచ్చలమల్లీ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఈ సినిమా నుండి విడుదలైన టీజర్,ట్రైలర్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూసిన నెటిజెన్స్ బచ్చల మల్లీ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు.ఈ సినిమా మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. మరి ఈ ఏడాది ఎండింగ్లో రాబోతున్న బచ్చలమల్లీ సినిమా అల్లరి నరేష్ కెరీర్ కి ప్లస్ అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: