‘బాహుబలి’ తరువాత అనుష్క అనేక సినిమాలలో నటించినప్పటికీ ఆసినిమాలు అనుష్క రేంజ్ ని పెంచలేకపోయాయి. దీనికితోడు ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడ బాగా తగ్గిపోవడంతో ఆమె తన ఇంటికే పరిమితం అయింది. ఇలాంటి పరిస్థితులలో ఏప్రియల్ 18న విడుదల కాబోతున్న ‘ఘాటి’ మూవీతో అనుష్క కెరియర్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందని ఆమె అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.



‘వేదం’ మూవీ తరువాత ఈమూవీ కోసం క్రిష్ అనుష్కలు కవడంతో ఈమూవీ పై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అనుష్క ఇంతవరకు నటించిన ఏసినిమా లోనూ ఇంత వైలెంట్ గా కనిపించక పోవడంతో ఈమూవీ ఆమె కెరియర్ కు మరొక బ్రేక్ ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  



ఒక మనిషి మెడ నరికి అతని తలను ఎక్కడికో తీసుకెళ్లిపోవడం సాధారణంగా కమర్షియల్ సినిమాలలో టాప్ హీరోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పాత్రను అనుష్క చేయడం ఒక విధంగా సాహసం అనుకోవాలి. దీనికితోడు సెన్సిబుల్ కథలను సినిమాలుగా తీసే క్రిష్ ఇలాంటి వైలెంట్ కథతో సినిమా తీయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.



ఈమూవీ కథ అంతా గంజాయి వ్యాపారం చుట్టూ తిరుగుతుందని లీకులు వస్తున్నాయి. పొట్టకూటి కోసం వేరే ఊరికి వెళ్లిన యువతి అక్కడ దగాకు గురైతే అదే చోట ఎదురుతిరిగి నేర సామ్రాజ్యం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకునే మహారాణిగా ఎలా ఎదిగింది అన్న పాయింట్ ‘ఘాటి’ మూవీలో కనిపిస్తుందని అంటున్నారు. దర్శకుడు సుకుమార్ డిజైన్ చేసిన పుష్పరాజ్ పాత్ర ఎర్ర చందనం సామ్రాజ్యానికి సంబంధించింది అయితే ‘ఘాటి’ మూవీలో గంజాయి లేడీ డాన్ గా అనుష్క చుక్కలు చూపెడుతుంది అని అనుకోవాలి. ఈమూవీ వజయం అటు అనుష్క కు ఇటు దర్శకుడు క్రిష్ కు చాల కీలకంగా మారడంతో ఈమూవీ విజయం పై అన్ని వర్గాలలోను ఆశక్తి ఎక్కువగా ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: