అమ్మాయిల కోసం అబ్బాయిల కొట్టుకోవడం ఎలా అయితే కామనో అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకోవడం కూడా ఈ జనరేషన్ లో కామన్ అయిపోయింది. అయితే సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఇలా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అయితే అనుష్క శర్మ దీపిక పదుకొనే కూడా ఓ హీరో కోసం పబ్లిక్ గానే తమ పగ ప్రతికారం చూపించారట.మరి ఇంతకీ దీపిక పదుకొనే అనుష్క శర్మ ఇద్దరు ఏ హీరో కోసం గొడవ పెట్టుకున్నారు..నిజంగానే ఆ హీరో ఇద్దరినీ బకరాలని చేశాడా అనేది ఇప్పుడు చూద్దాం.. సినీ సెలబ్రిటీలు ఒక హీరో ప్రేమించిన హీరోయిన్ ని మరో హీరో ప్రేమించడం, ఒక హీరోయిన్ ప్రేమించిన హీరోని మరో హీరోయిన్ ప్రేమించడం అనేది చాలా కామన్.ఇక బాలీవుడ్ లో అయితే ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లో అలియా భట్ రణ్ వీర్ సింగ్ లు ప్రేమికులు.అలాగే దీపికా పడుకొనే రన్బీర్ కపూర్ లు ప్రేమికులు.

కానీ ఆ తర్వాత అలియా భట్ జంట దీపిక జంట ఇద్దరు విడిపోయారు.ఆ తర్వాత అలియా భట్ రన్బీర్ కపూర్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.దీపిక పదుకొనే రన్వీర్ సింగ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అలా వీరిద్దరూ బాయ్ ఫ్రెండ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు పెళ్లిళ్లు చేసుకున్నారు.అయితే రణ్వీర్ సింగ్ అలియా భట్ ని మాత్రమే కాదు మొదట్లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మని కూడా ప్రేమించారు.అలా రన్వీర్ సింగ్ అనుష్క శర్మల ప్రేమ చాలా రోజులు కొనసాగింది.కానీ ఆ తర్వాత దీపికా ఎంట్రీ ఇవ్వడంతో అనుష్క శర్మ రణ్ వీర్ సింగ్ ల మధ్య గొడవలు వచ్చి అనుష్క శర్మకి బ్రేకప్ చెప్పి రణ్ వీర్ సింగ్ దీపికా పదుకొనేతో డేటింగ్ చేశారనే టాక్ అప్పట్లో బీటౌన్ లో వినిపించింది.

ఎప్పుడైతే రణ్ వీర్ దీపిక పదుకొనేతో ప్రేమలో పడ్డాడో అప్పటినుండి దీపిక పదుకొనే అనుష్క శర్మల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పగ పెరిగిపోయిందట. ఇప్పటికి కూడా వీరి మధ్య ఆ పగ చల్లారాలేదని తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా అనుష్క శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం గురించి చెప్పింది. అయితే ఈ విషయంలో పరోక్షంగా దీపిక పదుకొనేకి చురకలు అంటించేలా మాట్లాడింది.దీంతో ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ అనుష్క శర్మ కావాలనే దీపిక పదుకొనే పై ఇండైరెక్టు కామెంట్లు చేసింది. రణ్ వీర్ సింగ్ ని తననుండి దీపిక పదుకొనే లాక్కుంది అనే కోపం ఇంకా అనుష్కలో పోలేదు.ఆ పగ ఇంకా చల్లారలేదు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అంటూ బీటౌన్ జనాలు మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: