సలార్, కల్కి సినిమాలకు సంబంధించి మొదట ప్రకటించిన రిలీజ్ డేట్లకు ఆ సినిమాలు విడుదలైన డేట్లకు ఏ మాత్రం పొంతన లేదు. ది రాజాసాబ్ మూవీ చెప్పిన సమయానికే విడుదలవుతుందని మేకర్స్ చెబుతున్నా వాస్తవంగా ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ప్రభాస్ ప్రతి సినిమాకు ఇదే పరిస్థితా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ కే ఎందుకిలా జరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ మూవీని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం, ఏప్రిల్ నెల 18వ తేదీన అనుష్క ఘాటీ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ది రాజాసాబ్ విషయంలో కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగుతోంది. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తైందని సమాచారం అందుతుండటం గమనార్హం.
సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీని చెప్పిన తేదీకి రిలీజ్ చేస్తరేమో చూడాల్సి ఉంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డ భారీ విజయాలను అందుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. ప్రభాస్ తన సినిమాల షూటింగ్స్ వేగంగా జరిగే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.