- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ లో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే 2024 చరిత్రలోకి వెళ్లిపోయింది. వందల సంఖ్యలో సినిమాలో రిలీజ్ అయ్యాయి .. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఈ క్రమంలోనే 2024 లో కలెక్షన్ల పరంగా టాప్ 8 సినిమాలు ఏంటో చూద్దాం.


8) మంజు మాల్ బాయ్స్ :
ఈ యేడాది దుమ్ములేపిన ఈ మలయాళ సినిమా ఇండియాలో 142 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 241 కోట్లు వసూలు చేసింది.
7 ) వేట్టైయాన్ :
తమిళ‌ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ తమిళ చిత్రం భారత్ లో 146 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 253 కోట్లు వసూలు చేసింది.
6 ) హనుమాన్ :
ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ఈ తెలుగు సినిమా భారత్లో 202 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టింది.
5 ) అమరన్ :
తమిళ్ హీరో శివ కార్తికేయ‌న్‌ నటించిన ఈ తమిళ‌ బయోపిక్ భారతలో 219 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 332 కోట్లు వసూలు చేసింది.


4 ) దేవర 1 :
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమా భారత్లో 292 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 422 కోట్లు వసూలు చేసింది.
3 ) ది గోట్ :
తమిళ దళపతి విజయ్ నటించిన ఈ తమిళ సినిమా భారత్లో 252 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 457 కోట్లు వసూలు చేసింది.
2 ) కల్కి :
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - అమితాబచ్చన్ - కమలహాసన్ - దీపిక పదుకొనే నటించిన ఈ తెలుగు సినిమా భారత్ లో 646 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లు వసూలు చేసింది.
1 ) పుష్ప 2 ది రూల్ :
టాలీవుడ్ అల్లు అర్జున్ - రష్మిక నటించిన తెలుగు సినిమా భారత్లో ఇప్పటికే 824 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లు మొదటి పది రోజుల్లోనే సాధించి ఇంకా ధియేటర్లో రన్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: