టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతారు. ఆయన ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలు గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. వెంకటేష్ భార్య చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన దగ్గుపాటి నీరజ. ఆమె మాజీ మంత్రి .. ప్రస్తుత కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు స్వయానా మేడకోడలు కావడం విశేషం.
వెంకటేష్ మొత్తం నలుగురు సంతానం .. ముగ్గురు కుమార్తెలు .. ఒక బాబు. వెంకటేష్ కుమార్తెలు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. వెంకటేష్ తన పిల్లలను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చేలా వారిని ప్రోత్సహించారు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత అందరికీ పరిచయమే. పెళ్లి తర్వాత ఆమె ఫుడ్ వ్లాగర్ గా మారిపోయారు. రెండవ కూతురు హయవాహిని. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి ఇప్పుడు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో దూసుకుపోతుంది. చిన్న కుమార్తె భావన డిగ్రీ పూర్తి చేసిన ఈమె ఎక్కువగా క్రీడారంగం వైపు ఆసక్తి కనపరుస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ కుమారుడు పేరు అర్జున్ . మనోడికి సినిమా లపై ఆసక్తి ఉండడంతో త్వరలోనే సినిమాల్లోకి వస్తున్నాడని టాక్ ? అందుకు తగినట్టు గానే వెంకీ అరన్జున్ కు సినిమా మెళకువలు కూడా నేర్పిస్తున్నాడట.