- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .


మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక వరుస‌ పెట్టి సినిమాలు చేసుకుంటే వెళుతున్నారు. చిరంజీవి మరోసారి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వి వి . వినాయ‌క్ తో సినిమా చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్ కు కూడా చిరంజీవి అవకాశం ఇస్తాడని అన్నారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవి వరస మారింది. ఆయన సినీ దర్శకులకు దూరంగా జరుగుతున్నారు. ప్ర‌స్తుతం మ‌ల్లిడి వశిష్ట్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విశ్వంభర ఓ కొలిక్కి వచ్చేసింది. వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో చిరంజీవి మరోసారి కొత్త సినిమాల ప్రకటనలు మొదలుపెట్టారు. ఈసారి చిరంజీవి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టి ఒక్క సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెల కు అవకాశం ఇచ్చారు.


హీరో నాని సమర్పణలో దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల‌ దర్శకత్వంలో చిరంజీవి తర్వాత సినిమా ఉంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా చేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా ప్రకటన ఉంటుంది. ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్న అనిల్ రావి పూడి ఆ తర్వాత చిరంజీవితో చేయాల్సిన సినిమా పని మొదలు పెడతారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత అయ్యే అవకాశం ఉంది. ఇలా చూస్తుంటే వరుసగా చిరంజీవి యువ దర్శకులతో పరిచయటానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పూరి జగన్నాథ్ - v VINAYAK' target='_blank' title='వివి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వివి వినాయక్ - బోయపాటి శ్రీను లాంటి సీనియర్ దర్శ‌కులను ఆయన పక్కన పెట్టేసారని అంటున్నారు. పైగా కొత్త దర్శ‌కులతో పనిచేసి హిట్టు కొడితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా యువతకులకు ఇది నిజంగా మంచి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: