* కృతి శెట్టి కెరియర్ మారుస్తుంది అనుకున్న ఈ సినిమా ఫ్లాప్ గానే మిగిలింది.
*2025 లో శర్వానంద్ కు కలిసొస్తుందేమో చూడాలి.
(ఏపీ -ఇండియా హెరాల్డ్)
తెలుగు సినీ ఇండస్ట్రీలో యూత్ ఫుల్ ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో శర్వానంద్.. అయితే శర్వానందుకు 2024 ఏమాత్రం కలిసి రాలేదని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా హీరో శర్వానంద్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నారు.. 2018 తర్వాత శర్వానంద్ ఖాతాలో సరైన హిట్ అన్నది ఏ సినిమా కూడా కనిపించడం లేదట.మధ్య మధ్యలో సినిమాలు వస్తూ ఉన్నారు కానీ శర్వానంద్ కి చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదట.
2024లో కేవలం ఒకే ఒక్క సినిమా రిలీజ్ అయ్యింది. అదే మనమే సినిమా.. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.. ఇందులో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి పరిస్థితి కూడా తెలుగులో అయితే ఇంతే దారుణంగా ఉన్నది.. ఈమె నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ సక్సెస్ కాలేదు..దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమై ఇతర భాషలలో కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక శర్వానంద్ వంటి హీరోలు ఈ ఏడాదికి రెండు చిత్రాలు విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నప్పటికీ.. సరైన సినిమా కథలు ఎంచుకోలేకపోవడంతో సినిమాలు డిజాస్టర్లుగా మిగులుతున్నాయి..
దీంతో ఏడాదికి ఒక్క సినిమాను విడుదల చేసేలా పరిస్థితి మారిపోయింది.. మరి వచ్చే ఏడాది అయినా రెండు మూడు సినిమాలతో అభిమానులను ఖుషి చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మాణంలో ఒక సినిమా,తన సొంత బ్యానర్ లోనే ఒక సినిమాలో నటిస్తూ ఉండడమే కాకుండా యువి నిర్మాణంలో కూడా ఒక సినిమాలు నటిస్తున్నారట. వచ్చే ఏడాది అయినా సరైన సక్సెస్ అందుకోకుంటే హీరో శర్వానంద్ కెరియర్ కొనసాగడం కష్టమే అని పలువురి నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. మనమే సినిమా మీద ఎంతో ఆశ పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. మనమే సినిమాకి పెట్టిన ఖర్చులు సగభాగం కూడా రాలేదని సమాచారం..