అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఈనెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. సుకుమార్ డైరెక్షన్, రష్మిక హీరోయిన్గా, అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే రూ .1500 కోట్లకు చేరువలో ఉన్నది. పుష్ప 2 చిత్రం నుంచి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఈ చిత్రంలోని పాటలు సైతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ పుష్ప 2 చిత్రం నిడివి ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాలోని కొన్ని సాంగ్స్ సన్నివేశాలను డిలీట్ చేయడం జరిగింది.


అయితే ఇప్పుడు తాజాగా అలాంటి సీన్స్ లోని కొన్ని యాడ్ చేసి టైటిల్ వీడియో సాంగ్ అని రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. అయితే ఈ డిలీట్ సన్నివేశాలు చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎందుకు డిలీట్ చేశారు ఒకవేళ ఇది థియేటర్లో ఉండి ఉంటే విజిల్స్ పడడం ఖాయం అనే విధంగా తెలియజేస్తున్నారు. గతంలో పుష్ప 2 సినిమా రన్ టైం గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. మూడు గంటలకు పైగా ఉండడంతో ఈ సినిమా స్టోరీ మీద ఒక చర్చే జరిగింది.



అయితే ఆడియన్స్ అంచనాలను మించిపోయి మరి థియేటర్లో భారీగానే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా డిలీట్ అయిన సన్నివేశాలలో పుష్ప తన చిన్నతనంలో ఎక్కడైతే క్రికెట్ ఆడనివ్వలేదో అక్కడే పిల్లలతో కలిసి మరి క్రికెట్ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుంది. పుష్ప స్టైల్ లో మేనరిజన్లో కూడా క్రికెట్ ఆడే పిల్లలతో స్టెప్పులు వేసే సీన్స్  డిలీట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ సన్నివేశాలు యాడ్ చేసి ఉంటే ఈ సీన్స్ కచ్చితంగా థియేటర్లో విజిల్స్ పడేవని అభిమానులు తెలుపుతున్నారు. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషనల్ గా ఈ డిలీట్ సీన్స్ మారుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: