ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ మహారాజు రవి తేజ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, భూషణ్ కుమార్ , క్రిషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో హక్కులను టి-సిరీస్ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు సుబ్రమణ్యం ఫర్ సేల్ మరియు గద్దలకొండ గణేష్ తర్వాత మూడవసారి హరీష్ శంకర్‌తో కలిసి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవి తేజకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇందులో  జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.
15 ఆగస్టు 2024న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బాంబుగా మారింది. ఈ సినిమాను రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. రవితేజ హీరోగా చేసిన మిస్టర్ బచ్చన్ మూవీకి నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ జరిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 10 లక్షలే రాబట్టింది. ఇలా వారంలో కేవలం రూ. 7.95 కోట్లే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది.
సినిమా లో రవి తేజ చాలా బాగా నటించినప్పటికి.. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. కథలో కావాల్సిన ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో అంతా అంతా మాత్రమే నడిచిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: