కొన్ని సినిమాల్లో ప్రభాకర్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కూడా నటించాడు. అలాగే చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేశారు. అయితే ప్రభాకర్ ఈ మధ్యే ఆయన కొడుకును హీరోగా పరిచయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఆయన కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్ గా 'వెంకట రామయ్యగారి తాలూకా, కేరాఫ్ సీతారాంపురం' సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాలో హీరోగా దినేష్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి
ఎస్ వి కే బ్యానర్ , కోమలి క్రియేషన్స్ పతాకం పై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, నిర్మాత సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్,కోమలి, నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమా సతీష్ ఆవాలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రం విశాఖపట్నం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రించిన ముహూర్తపు సన్నివేశానికి ఈటీవీ ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత మరియు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇక ఇప్పుడు దివిజ ప్రభాకర్ సెలబ్రిటీ లిస్ట్ లోకి చెరిపోయింది. ప్రభాకర్ కూతురిగా దివిజ సినిమా ఎలా ఉంటుందో అన్నీ వేచి చూస్తున్నారు.