2024 సంవత్సరం ఇప్పటికే ముగింపు దశకు వచ్చేసింది .. మరో 15 రోజుల్లో 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం .. ఇప్పటికే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ హడావుడి మొదలయ్యింది .. ఈ సంవత్సరంలో విజయాలు అందుకున్న హీరోల అభిమానులు ఖుషి గా ఉంటే .. మరి కొంతమంది అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు . తమ హీరో సినిమా రాలేదని ఫీల్ అవుతున్నారు .. ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా థియేటర్లో తీసుకురాని హీరోలు ఎవరు ? డుమ్మా కొట్టింది ఎవరు ? అనేది ఇక్కడ చూద్దాం.ఇక ముందుగా మెగాస్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి వాల్తేరు విర్యయతో వచ్చి భారీ హీట్ కొట్టాడు .. అయితే మళ్ళీ అదే సంవత్సరం ఆగస్టులో విడుదలైన భోళా శంకర్ తో ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చాడు .. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో మెగాస్టార్ పునరాలోచనలో పడ్డారు .. తను చేసే సినిమాలు ఎంపికులో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు .. అందుకే ఈ ఏడాది ఆయన నుంచి ఒక సినిమా కూడా రాలేదు .. కొత్త దర్శకులు కొత్త కథలు వింటున్నారు. ఫైనల్ గా బింబిసార దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు . ముందుగా వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అనుకున్నారు .. కానీ తన కొడుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం తన నిమాను సమ్మర్ కి వాయిదా వేసుకున్నాడు .. ప్రస్తుతం త్వరలోనే అనిల్ రావిపూడి తో మరో సినిమాను ప్రకటించబోతున్నాడు .. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో కూడా ఓ సినిమాను కన్ఫర్మ్ చేశాడు మెగాస్టార్.
ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా గత సంవత్సరం భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయం అందుకున్నారు .. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆయన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు . బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్‌లో బాలయ్య నటిస్తున్నారు .. అయితే ముందుగా ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు .. కానీ మధ్యలో ఏపీ ఎన్నికల కారణంగా సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది . కాగా వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఇక సినిమాల మధ్య గ్యాప్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాలయ్య.. తాజాగా అఖండ 2 మొదలుపెట్టి షూటింగ్లో బిజీ అయిపోయారు .. అలాగే 2025లో తన కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కూడా ఉండనుంది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 అంత ఏపీ రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించారు .. ఒకవైపు ఎన్నికలు మరోవైపు కూటమి సయోధ్య కుదించడం .. ఇంకోవైపు జనసేన పార్టీ బాధ్యతలు .. ఇలా గ్యాప్ లేకుండా వరుస రాజకీయ పనులతో ఒక సినిమా కూడా ఆయనది ఈ సంవత్సరం రాలేదు ... కానీ పవన్ కళ్యాణ్ చేతులో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి .. అందులో హరిహర వీరమల్లు 2025 మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది .. అలాగే ఆ తర్వాత ఓజి కూడా 2025 లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.. దర్శకధీరుడు రాజమౌళితో rrr తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నా రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో నటించాడు.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది .. అయితే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ సమయంలోనే సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు .. గత ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది .. అయితే శంకర్ సినిమాలో గతంలో మాదిరిగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఆయన దగ్గర్నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆయన సినిమాపై హోప్స్ లేకుండా చూస్తున్నారు .. ఇక దీంతో శంకర్ , రామ్ చరణ్ సినిమా ఆలస్యం అవుతూనే వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ , శంకర్ గేమ్ చేంజర్ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాని హీరోలలో అక్కినేని బ్రదర్స్ కూడా ఉన్నారు .. గత సంవత్సరం 2023 లో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్.. అలాగే నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇద్దరు అన్నదమ్ములు భారీ డిజాస్టర్లు అందుకున్నారు .. ఏజెంట్ ఇచ్చిన షాక్ తో అఖిల్ రెండు సంవత్సరాలు పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు .. ప్రస్తుతం ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇక నాగచైతన్య పాన్ ఇండియా మార్కెట్ మీద్నేశాడు.. చందు మండేటి దర్శకత్వంలో తండాల్ సినిమాతో ఫిబ్రవరిలో రానున్నాడు. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా విరూపాక్ష సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు.. అయితే ఈ సంవత్సరం ఒక సినిమాతో కూడా ఈ మెగా హీరో రాలేదు.. కానీ తాజాగా సంబరాలు ఏటిగట్టు అనే యాక్షన్ మూవీని మొదలు పెట్టాడు తేజ్.. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానంది పాన్ ఇండియా స్థాయిలో.. ఇలా 2024 సంవత్సరంలో ఈ హీరోలందరూ వారి అభిమానులకు షాక్ ఇచ్చారు.