రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ వేటలో ఉన్నాడు .. సంక్రాంతి తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది .. ఇదే క్రమంలో ఈ దర్శక ధీరుడుతో సినిమా చేయాలని ఇండియాలో ఉన్న అగ్ర నటులు , స్టార్ హీరోలు , హీరోయిన్లు ఎన్నో కలలు కంటున్నారు .. కానీ రాజమౌళి మాత్రం తనకు నచ్చిన వారితోనే ఇప్పటివరకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు .. అయితే అలాంటి రాజమౌళి కి ఆయన కెరీర్లో ఓ అగ్ర నటి ఆయనకు నో చెప్పిందిట .. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరు ... రాజమౌళి కి ఎందుకు నో చెప్పింది అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఇంతకీ రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్ మరి ఎవరో కాదు .. అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు , తమిళ , హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణించారు శ్రీదేవి దాదాపు రెండున్నర దశాబ్దల పాటు ఇండియన్ చిత్ర పరిశ్రమను ఏలింది ఈ అందాల ముద్దుగుమ్మ ..
ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు దివంగత నటి శ్రీదేవి .. అయితే ఈ అతిలోక సుందరికి రాజమౌళి పిలిచి మరి అవకాశం ఇచ్చారట .. కానీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆమె ఆఫర్కు నో చెప్పిందిట .. ప్రభాస్ హీరోగా బాహుబలి రాజమౌళి తెరకెక్కించిన సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించారట .. ఇక శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని భావించారట జక్కన్న .. అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి 8 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేశారట .. అలాగే వీటితో పాటు ఆమె హోటల్ బిల్లులు ఫ్లైట్ చార్జీలు అన్నీ కలుపుకుని దాదాపు 15 కోట్ల వరకు అవుతున్నాయట .. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణ తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి .. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ ఆ వార్తల్లో నిజం లేదని కొట్టు పడేశారు.