మెగాస్టార్‌ చిరంజీవి అంటే మాస్‌ హీరో. అంతకు మించిన కమర్షియల్‌ హీరో. ఆయన సినిమాల్లో అన్నీ ఉండాలి. పాటలుండాలి, డాన్సులుండాలి, ఫైట్లు ఉండాలి, పవర్‌ఫుల్‌ డైలాగులుండాలి అంతకు మించిన ఫన్‌ ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ ఎంజాయ్‌ చేస్తారు. చిరంజీవి సినిమా కమర్షియాలిటీకి మారు పేరు అనేలా ముద్ర పడింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ లాంటి డిసాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ మూవీ విశ్వంభర ముందు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే9న రిలీజ్ కాబోతుంది. ఇదిలావుండగా విశ్వంభర టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతాయి అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చిరంజీవిని చాలా సంవత్సరాలుగా ఫ్యాన్స్‌ ఎలా అయితే చూడాలని ఎదురు చూస్తున్నారో అలా ఈ సినిమాలో చూడబోతున్నారు. అద్భుతమైన కథ, కథనంతో సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు.ఈ నేపథ్యంలో నే సోషియో ఫాంటసీ చిత్రంగా సిద్ధమవుతుంది.మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మే 9న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ డేట్ నిర్ణయించడానికి వేరొక కారణం కూడా ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీ మే 9న రిలీజ్ అయ్యింది.అందుకే సెంటిమెంటల్ గా కలిసొస్తుందని యూవీ క్రియేషన్స్ వారు కూడా అదే డేట్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అలాగే సంక్రాంతికి 'విశ్వంభర' మూవీ నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఉండొచ్చని భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో త్రిష మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే ప్రస్తుతం విడుదలైన విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. చిరు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్ లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. అలాగే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని చిరంజీవి కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: