IMDB లో అత్యధికంగా ప్రజాధరణ పొందిన సెలబ్రిటీలలో అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నారు.. పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన శ్రీ లీల మూడవ స్థానంలో నిలువగా రష్మిక ఐదవ స్థానంలో ఉన్నది.. ఇక మొదటి స్థానంలో యానిమల్ చిత్రంతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ట్రిప్తి దిమ్రి అగ్రస్థానంలో నిలిచింది అలాగే రజనీకాంత్, దీపికా పదుకొనే, ఆలియా భట్ ,సాయి పల్లవి, శివ కార్తికేయన్ తదితరులు సైతం టాప్ -10 జాబితాలో నిలిచారు.2024 ఏడాదికి సంబంధించి టాప్ టెన్ అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ వీక్లీ స్టార్స్ ర్యాంకును కూడా విడుదల చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఇందులో 250 మిలియన్లకు పైగా నెలవారి సందర్శకులు ఉంటారట. వీరి ఆధారంగానే లిస్టు ని తయారు చేస్తూ ఉంటారట .మొత్తానికి పుష్ప 2 చిత్రం ద్వారా భారీ క్రేజీ సంపాదించుకున్న నటీనటులకు ఐఎండిబి లో స్థానం దక్కడంతో అభిమానుల సైతం ఖుషి అవుతున్నారు.. ఇప్పటికే పుష్ప 2 సినిమా విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ పైన ఏదో ఒక చిక్కులు వచ్చి పడుతూనే ఉన్నాయి.ముఖ్యంగా అల్లు అర్జున్ ని సైతం ఎలాగైనా ఎదగనివ్వకూడదనే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. ఇటీవలే సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను చాలామంది సెలబ్రిటీలు పరామర్శిస్తున్నారు.